ఆరోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య

by Bhanu |   (  Updated:2025-06-18 11:30:34  IST  )

గంగాధర మండలంలోని కొండయ్యపల్లి గ్రామానికి చెందిన రేండ్ల రామస్వామి (74) అనే వృద్ధుడు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన కడుపునొప్పి, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు.

ఆరోగ్య సమస్యలతో వృద్ధుడు ఆత్మహత్య
X

దిశ, గంగాధర: గంగాధర మండలంలోని కొండయ్యపల్లి గ్రామానికి చెందిన రేండ్ల రామస్వామి (74) అనే వృద్ధుడు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన కడుపునొప్పి, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. ఎన్నో ఆసుపత్రుల్లో చికిత్స పొందినా నొప్పులు తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది, సోమవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గడ్డి మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేశాడని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. కుటుంబసభ్యులు గమనించి అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న రామస్వామి మంగళవారం రోజు రాత్రి 11 గంటల సమయంలో చికిత్సలో మృతి చెందాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గంగాధర ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపారు.

Next Story