తోటపల్లిలో వృద్ధుడి ఆత్మహత్య

by Taduka Kalyani |

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.

తోటపల్లిలో వృద్ధుడి ఆత్మహత్య
X

దిశ,బెజ్జంకి : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంపెల్లి చంద్రయ్య (65) తన ఇంటిలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి కుమార్తె సొల్లు సుజాత ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, చంద్రయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యులు వివిధ కారణాల వల్ల దూరంగా ఉండటంతో ఆయన మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. జూన్ 18న ఉదయం ఇంటి పక్కన నివసించే వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులకు ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story