రీల్స్ పిచ్చితో ఒకే బైక్ పై 8మంది..అరెస్ట్ చేసిన పోలీసులు

by Ajay Maddhiboyina |

రీల్స్ పిచ్చితో కొంద‌రు రోడ్ల మీద స్టంట్స్ చేస్తున్నారు. అలా స్టంట్స్ చేస్తూ వాళ్ల ప్రాణాల మీద‌కు తెర్చుకోవ‌డ‌మే కాకుండా తోటి ప్ర‌యాణికుల ప్రాణాలు సైతం తీస్తున్నారు.

రీల్స్ పిచ్చితో ఒకే బైక్ పై 8మంది..అరెస్ట్ చేసిన పోలీసులు
X

దిశ‌, వెబ్ డెస్క్: రీల్స్ పిచ్చితో కొంద‌రు రోడ్ల మీద స్టంట్స్ చేస్తున్నారు. అలా స్టంట్స్ చేస్తూ వాళ్ల ప్రాణాల మీద‌కు తెర్చుకోవ‌డ‌మే కాకుండా తోటి ప్ర‌యాణికుల ప్రాణాలు సైతం తీస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసినా , కేసులు న‌మోదు చేసి కౌన్సిలింగ్ ఇచ్చినా అలాంటి వారిలో మాత్రం మార్పు రావ‌డంలేదు. హైద‌రాబాద్ రోడ్ల‌పై త‌ర‌చూ ఎక్క‌డో ఒక‌చోట ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా రాజేంద్ర‌న‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలోనూ అలాంటి ఘ‌ట‌నే చోటు చేసుకుంది. రీల్స్ పిచ్చితో ఒకే బైక్ పై ఏకంగా ఎనిమిది మంది యువ‌కులు ప్ర‌యాణించారు. సాధార‌ణంగా బైక్ పై ఇద్ద‌రి కంటే ఎక్కువ మంది ప్ర‌యాణించ‌కూడ‌దు అనే రూల్ ఉంది. ముగ్గురు ప్ర‌యాణిస్తేనే త్రిబుల్ రైడింగ్ కింద కేసు న‌మోదు చేస్తారు. అలాంటిది ఏకంగా ఎనిమిది మంది సోష‌ల్ మీడియాలో వ‌చ్చే లైకులు వ్యూవ్స్ కోసం ఈ స్టంట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో బండి నంబ‌ర్ ఆధారంగా పోలీసులు కేసు న‌మోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.

Next Story