ఘోర రోడ్డు ప్రమాదం – ఎనిమిది మంది మృతి

by Malleboina Mahesh |

ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని షహదా పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది.

ఘోర రోడ్డు ప్రమాదం – ఎనిమిది మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలోని షహదా పోలీస్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రావెల్స్ వాహనం నందూర్బార్‌లోని చాంద్‌షాలి ఘాట్ వద్ద అదుపు తప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా మరో మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నందుర్బార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఘాట్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న వాహనం నియంత్రణ కోల్పోయి లోయలో పడిపోవడంతో ఈ విషాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన వాహనం అస్తంబా యాత్ర ముగించుకుని తిరిగి వెళ్తున్న భక్తులను తీసుకెళ్తుంది. ఘాట్ మార్గంలోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో పికప్ వాహనం పల్టీ కొట్టింది. ఆ వాహనంలో వెనుక భాగంలో కూర్చున్న పలువురు వ్యక్తులు వాహనం నుంచి కింద పడిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story