మరోసారి పంజా విసిరిన ఈడీ.. వ్యాపారి బూరుగు రమేష్ ఇంట్లో సోదాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-18 04:10:26  IST  )

హైదరాబాద్ నగరంలో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి.

మరోసారి పంజా విసిరిన ఈడీ.. వ్యాపారి బూరుగు రమేష్ ఇంట్లో సోదాలు
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌ పరిధిలోని మహేంద్ర హిల్స్‌లో ఈడీ అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ (Burugu Ramesh) ఇంట్లో అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. రెండు బృందాలుగా విడిపోయి అల్వాల్, మారేడుపల్లి ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపడుతున్నారు. మరోవైపు బూరుగు రమేష్ కుమారుడు విక్రాంత్ (Vikrant) ఇంట్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story