- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఈడీ దాడులు.. YS రెడ్డి ఇంట్లో రూ.23 కోట్ల విలువైన డైమండ్స్ సీజ్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డి(YS Reddy) లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు పెంచారు. ముంబై టౌన్ ప్లాన్ డిప్యూటీ డైరెక్టర్ YS రెడ్డి(YS Reddy) లక్ష్యంగా దాడులు జరుపుతున్నారు. హైదరాబాద్, ముంబైలోని మొత్తం 13 చోట్ల ఏకకాలంలో విస్తృతంగా దాడులు చేపట్టారు. ఆయన ఇంట్లో దాదాపు రూ.23.5 కోట్ల విలువైన బంగారం, డైమండ్స్, రూ.8.6 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. కాగా, 41 భవనాలకు అక్రమ అనుమతులు ఇచ్చారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. బిల్డర్స్‌తో కుమ్మక్కై అనధికారికంగా అనుమతులు మంజూరు చేసి డబ్బులు దండుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో ఈడీ అధికారులు దూకుడుగా వ్యహరిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోషన్స్ విషయంలో సినీ నటుడు మహేష్ బాబుపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చారు. బ్రాండ్ ప్రమోషన్ కోసం మహేష్ బాబు రూ.5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అయితే.. సదరు కంపెనీ చేసిన లావాదేవీలన్నీ.. అక్రమ లావాదేవీలే అని ఈడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు.






