హైదరాబాద్‌లో మరోసారి ED దాడులు

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-24 10:51:43  IST  )

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్‌లో మరోసారి ED దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దాడులు నిర్వహించారు. గురువారం ఒకేసారి 13 మంది హవాలా ఆపరేటర్ల ఇళ్లలో సోదాలు జరిపారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. దాడుల అనంతరం పలువురు ఆపరేటర్లను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హవాలా లావాదేవీలు పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు గుర్తింంచారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. చిత్రపురి కాలనీలో రూ.75 లక్షల నగదుతో పాటు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఇటీవల ED అధికారులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఒక రియల్ ఏస్టేట్ యాడ్‌కు సంబంధించిన కేసులో సినీ నటుడు మహేశ్ బాబుకు సైతం నోటీసులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మహేశ్ బాబును ఆదేశించారు. అంతేకాదు.. హైదరాబాద్‌ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న అన్ని గ్రూపులపై ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇటీవల సాయిసూర్య డెవలపర్స్‌ ఆఫీసుల్లో కూడా సోదాలు నిర్వహించారు.

Next Story