తెలంగాణ వ్యాప్తంగా ED దాడులు

by Gantepaka Srikanth |

తెలంగాణలో ఈడీ(Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు.

తెలంగాణ వ్యాప్తంగా ED దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఈడీ(Enforcement Directorate) అధికారులు మరోసారి దూకుడు ప్రదర్శించారు. బుధవారం తెల్లవారుజాము నుంచే దాడులకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేస్తుండగా.. ఒక్క హైదరాబాద్‌లోనే ఆరు చోట్ల తనిఖీలు చేస్తున్నారు. గొర్రెల పంపిణీ కేసు(Sheep Scheme Scam)లో కూపీ లాగేందుకు ఈ దాడులు చేపట్టారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌(BRS) హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్‌ (Sheep Distribution)‌ కేసు (Case)లో రూ.700 కోట్లు అవినీతి జరిగిందంటూ గతంలో ఏసీబీ(ACB) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఏసీబీ పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించింది. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే గొర్రెల స్కీంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. పలువురు అధికారులను సైతం విచారించారు. విచారణలో వారు వెల్లడించిన వివరాల ఆధారంగా తాజాగా తనిఖీలు చేస్తున్నారు.

Next Story