- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియాంక గాంధీ భర్తకు భారీ షాకిచ్చిన ED.. ఆస్తులన్నీ జప్తు
by Gantepaka Srikanth |
కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు భారీ షాకిచ్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా(Robert Vadra)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు భారీ షాకిచ్చారు. భూలావాదేవీల కేసులో వాద్రా ఆస్తులను జప్తు చేశారు. వాద్రాకు చెందిన 43 ఆస్తులను గురువారం ఈడీ అధికారులు జప్తు చేసినట్లు ప్రకటించారు.
అయితే.. 2008లో రాబర్ట్ వాద్రాకు చెందిన సంస్థకు రూ.7.5 కోట్లకు 3.53 ఎకరాల భూమి కేటాయించారు. ఆ తర్వాత ఆ భూములను వాద్రా రూ.58 కోట్లకు విక్రయించారు. దీంతో రాబర్ట్ వాద్రాతో పాటు మరో 11 మందిపై ఈడీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పేరిట ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి విక్రయించారని ఛార్జిషీట్‌లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






