మాజీ ఎంపీ, నటి ఊర్వశి రౌటేలాకు ED నోటీసులు

by Gantepaka Srikanth |

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్‌ కేసు(Betting APP Promotions Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు.

మాజీ ఎంపీ, నటి ఊర్వశి రౌటేలాకు ED నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్స్‌ కేసు(Betting APP Promotions Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దూకుడు పెంచారు. మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి(Mimi Chakraborty), నటి ఊర్వశి రౌటేలా(Urvashi Rautela)కు ఆదివారం నోటీసులు(ED Notices) జారీ చేశారు. ఈనెల 15న విచారణకు రావాలని మిమి చక్రవర్తికి పంపిన సమన్లలో పేర్కొన్నారు. ఈ నెల16న విచారణకు నటి ఊర్వశి రౌటేలాకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. వీరితో పాటు ప్రముఖ తెలుగు నటులు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కేసులో చిక్కుకున్నారు. రానా ద‌గ్గుబాటితో పాటు మంచు లక్ష్మి, విజ‌య్ దేవ‌ర‌కొండ, ప్రకాశ్‌రాజ్, ప్రణీత‌, నిధి అగర్వాల్‌, శ్రీముఖి, రీతూ చౌద‌రి, యాంక‌ర్ శ్యామ‌ల‌, అనన్య నాగళ్ల త‌దిత‌రులపై ఇప్పటికే కేసు న‌మోదు చేశారు. ఇక సోష‌ల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్లల‌లో నీతూ అగర్వాల్, విష్ణు ప్రియ, వర్షిణి, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, బండారు సుప్రీత వంటి పేర్లు ఉన్నాయి. వీరితోపాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉంది.

Next Story