సృష్టి ఫెర్టిలిటీ కేసులో ED ఎంట్రీ.. హైదరాబాద్‌ పోలీసులకు సంచలన లేఖ

by Gantepaka Srikanth |

సృష్టి ఫెర్టిలిటీ కేసు(Srushti Fertility Case)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

సృష్టి ఫెర్టిలిటీ కేసులో ED ఎంట్రీ.. హైదరాబాద్‌ పోలీసులకు సంచలన లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సృష్టి ఫెర్టిలిటీ కేసు(Srushti Fertility Case)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మనీ లాండరింగ్ ఆరోపణలు రావడంతో ఈడీ(Enforcement Directorate) అధికారులు రంగంలోకి దిగారు. కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ పోలీసులకు ఈడీ అధికారులు లేఖ రాశారు. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో డాక్టర్ నమత్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా నమత్ర రూ.కోట్లు సంపాదించినట్లు సమాచారం. ఈ కేసులో 30 మంది అరెస్ట్, విచారణ తర్వాత సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కాగా, పిల్లల విక్రయాల్లో దళారులుగా వ్యవహరించిన ముగ్గురిని ఇటీవల విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిరుపేదల కుటుంబాలను టార్గెట్ చేసుకుని వారి నుంచి పిల్లలను కొన్న వ్యవహారంలో వీరు అరెస్టయ్యారు. వీరితో డాక్టర్ నమ్రతకు సబంధాలు ఉన్నాయని.. వీరి ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story