- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: సాయి సూర్య డెవలపర్స్ ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన రూ.14.63 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం శనివారం తాత్కాలికంగా జప్తు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన రూ.14.63 కోట్ల విలువైన స్థిరాస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ జోనల్ కార్యాలయం శనివారం తాత్కాలికంగా జప్తు చేసింది. సాయి సూర్య డెవలపర్స్ పేరుతో ఉన్న భూములను ఈడీ పీఎంఎల్‌ఏ కింద అటాచ్ చేసింది. సంస్థ నిర్వాహకుడు సతీష్ చంద్ర గుప్త, ఇతరులపై రాష్ట్ర పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో ప్లాట్లు ఇస్తామని చెప్పి డిపాజిటర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసి, రిజిస్ట్రేషన్ చేయకుండా మోసగించినట్లు ఆరోపణలపై విచారించింది. విచారణలో ఒకే ప్లాట్‌ను పలువురికి విక్రయించినట్లు, అనధికారిక లేఅవుట్‌లతో మోసాలకు పాల్పడినట్లు వెల్లడించింది. బాధితుల నుంచి వసూలు చేసిన నగదు, చెక్కులు, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్లను వివిధ ఖాతాల్లోకి మళ్లించి నిందితులు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. గతం సంవత్సరం కూడా సూర్య డెవలపర్స్ సంస్థకు సంబంధించిన కార్యాలయాలపై సోదాలు ఈడీ సోదాలు చెపట్టినట్లు పేర్కొంది.






