‘క్వాక్ ఎరీనా పబ్‌’లో ఈగల్‌ టీమ్ రెయిడ్.. మళ్లీ రెడ్‌హ్యండె‌డ్‌గా దొరికిన నటి హేమ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-03 06:20:17  IST  )

హైదరాబాద్ కొండాపూర్‌లోని క్వాక్ ఏరీనా పబ్‌పై ఈగల్ టీమ్ దాడులు చేసింది. 64 మందికి పరీక్షలు చేయగా 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది.

‘క్వాక్ ఎరీనా పబ్‌’లో ఈగల్‌ టీమ్ రెయిడ్.. మళ్లీ రెడ్‌హ్యండె‌డ్‌గా దొరికిన నటి హేమ
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని పబ్‌లలో డ్రగ్స్ కల్చర్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా కొండాపూర్‌లోని ‘క్వాక్ ఏరీనా పబ్’ (Quack Arena Pub)పై ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పబ్‌లో పార్టీ జరుగుతున్న సమయంలో ఆకస్మికంగా ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, అక్కడ ఉన్న సుమారు 64 మందికి డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 8 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో ఆరుగురు గంజాయి (Marijuana) సేవించినట్లుగా, మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నటి హేమ వీడియో వైరల్..

అయితే, ‘క్వాక్ ఏరీనా పబ్’ పార్టీలో టాలీవుడ్ నటి హేమ కూడా పాల్గొన్నారు. అయితే, దీనిపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు నిర్వహించిన డ్రగ్స్ టెస్టులో నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ఓ వీడియోను సైతం పోస్ట్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదని, అనవసరంగా తనపై దుష్ప్రచారం చేయవద్దని ఆమె ఆ వీడియోలో కోరారు.

హేమ వీడియో ఇదే: https://x.com/TeluguScribe/status/2039922706750361661?s=20

Next Story