- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్ దూకుడు.. ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు
తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్(Eagle Team) దూకుడు పెంచింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీమ్(Eagle Team) దూకుడు పెంచింది. పోలీసుల సహాకారంతో డ్రగ్స్(Drugs) కేంద్రాలు, ముఠాలపై తనిఖీలు చేపట్టారు. రైళ్లు, పారిశ్రామిక వాడలపై ప్రముఖంగా దృష్టి సారించారు. ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 91 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రైళ్లలో గంజాయి తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా 32 కిలోల గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌లో మరో 214 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డిలో అల్ఫాజోలం తయారీ యూనిట్ గుట్టురట్టు చేశారు. ములుగు జిల్లా వాజేడులో 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇలాగే తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల పోలీసుల సహాకారంతో ఈగల్ టీమ్ దాడులు చేస్తోంది.






