HYD: ఈగల్ టీమ్ డెకాయ్‌ ఆపరేషన్.. 86 మంది అరెస్ట్

by Gantepaka Srikanth |

రాష్ట్రంలో ఈగల్ టీమ్(Eagle Team) దూకుడు పెంచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో డెకాయ్‌ ఆపరేషన్‌(Decoy Operation) నిర్వహించింది.

HYD: ఈగల్ టీమ్ డెకాయ్‌ ఆపరేషన్.. 86 మంది అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈగల్ టీమ్(Eagle Team) దూకుడు పెంచింది. శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో డెకాయ్‌ ఆపరేషన్‌(Decoy Operation) నిర్వహించింది. గంజాయి కొనుగోలు చేస్తుండగా 86 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది. పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, విద్యార్థులు, డెంటల్‌ టెక్నిషియన్స్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు, హెచ్‌ఆర్‌ మేనేజర్లు ఉన్నట్లు సమాచారం. 'భాయ్‌ బచ్చా ఆగయా' అంటూ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా గంజాయి అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. కాగా, ఇటీవలే హైదరాబాద్‌లోని మల్నాడు రెస్టారెంట్‌లో డ్రగ్స్ పార్టీని ఈగల్ టీమ్ భగ్నం చేసిన విషయం తెలిసిందే.

Next Story