మద్యం మత్తులో మందుబాబు వీరంగం.. ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య యత్నం

by Bhanu |   (  Updated:2025-06-18 15:55:42  IST  )

దిల్ సుఖ్ నగర్ మెట్రో సమీపంలో మెఘా థియేటర్ వద్ద ఉన్న ఎంజి లిక్కర్ మార్ట్ లో వైన్స్ షాప్ వద్ద గల ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ మందుబాబు ఆత్మహత్యకు యత్నించాడు.

మద్యం మత్తులో మందుబాబు వీరంగం..  ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఆత్మహత్య యత్నం
X

దిశ, చైతన్యపురి : దిల్ సుఖ్ నగర్ మెట్రో సమీపంలో మెఘా థియేటర్ వద్ద ఉన్న ఎంజి లిక్కర్ మార్ట్ లో వైన్స్ షాప్ వద్ద గల ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఓ మందుబాబు ఆత్మహత్యకు యత్నించాడు. కరెంట్ షాక్ తో తొడ భాగం నుంచి అరికాళ్ల వరకు అంతా కాలిపోవడంతో బాధతో విలపించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మద్యం తాగుతున్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి బీరు బాటిల్స్ తో పరస్పరం దాడి చేసుకున్నట్లు తెలిసింది. విషయం గమనించి మద్యం తాగుతున్న వారిపై వైన్స్ సిబ్బంది దాడి చేయడంతో సహనం కోల్పోయిన మద్యం ప్రియుడు విద్యుత్ స్తంభం ఎక్కి నిరసన తెలుపగా ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు కరెంటు వైర్ల పై నుండి కిందికి దింపి చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.

Next Story