- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర ప్రమాదం.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కార్మికులపై నుంచి దూసుకెళ్లిన కారు.. (VIDEO)
by Sujitha Rachapalli |
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. వసంత్ విహార్‌లోని శివ క్యాంప్ సమీపంలో ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లింది కారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. వసంత్ విహార్‌లోని శివ క్యాంప్ సమీపంలో ఫుట్ పాత్‌పై నిద్రిస్తున్న వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లింది కారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. లడ్డీ (40), ఆమె కూతురు బిమ్లా (8), భర్త సబామి అలియాస్ చిర్మా (45), రామ్ చందర్ (45), అతని భార్య నారాయణి (35) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్వారకాకు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉత్సవ్ శేఖర్ మద్యం సేవించి కారు నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అయింది. కాగా శేఖర్ సంఘటనా స్థలంలో ట్రక్కును ఢీకొని పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డాడు.
Next Story






