స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్..అడ్డంగా దొరికిపోయిన డ్రైవర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-26 12:19:03  IST  )

తెలంగాణలో మొద‌టిసారి స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించారు. హైదరాబాద్‌లోని పలు విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు టెస్టులు నిర్వహించగా ఓ డ్రైవర్ తాగి బస్ నడిపినట్టు గుర్తించారు.

స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్..అడ్డంగా దొరికిపోయిన డ్రైవర్
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో మొద‌టిసారి స్కూల్ బ‌స్ డ్రైవ‌ర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించారు. హైదరాబాద్‌లోని పలు విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు టెస్టులు నిర్వహించగా ఓ డ్రైవర్ తాగి బస్ నడిపినట్టు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో రీడింగ్ నమోదవ్వడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మరో డ్రైవర్‌తో పిల్లను సురక్షితంగా స్కూలుకు తరలించారు. పోలీసులకు పట్టుబడిన స్కూల్ బస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో మొదటిసారి స్కూల్ బస్ డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో నెటిజన్లు పోలీసులను అభినందిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తరవాత కాకుండా ముందే ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల నష్టం కలగకుండా ఉంటుందని సూచిస్తున్నారు.

Next Story