బ్రేకింగ్: ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.21 కోట్ల డ్రగ్స్ పట్టివేత

by Satheesh |
బ్రేకింగ్: ఢిల్లీ ఎయిర్ పోర్టులో రూ.21 కోట్ల డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. కెన్యా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడు హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తరలించే యత్నం చేశాడు. కాగా, అతడి కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. పోలీస్ ట్రైన్ డాగ్ డ్రగ్స్ వాసన పసిగట్టి గుట్టురట్టు చేసింది. దీంతో కస్టమ్స్ అధికారులు కెన్యా దేశానికి చెందిన ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి రూ.21 కోట్ల విలువ చేసే 3 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీగా డ్రగ్స్ పట్టుబడిన నేపథ్యంలో ఎయిర్ పోర్టులో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

Next Story

Most Viewed