డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం: రూ. 814 కోట్ల డ్రగ్స్ సీజ్.. 1386 మంది అరెస్ట్!

by Malleboina Mahesh |

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలంగా మారింది. గత కొంత కాలంగా ముంబైలో డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు పోలీసులు యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే.

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం: రూ. 814 కోట్ల డ్రగ్స్ సీజ్.. 1386 మంది అరెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీగా డ్రగ్స్ (Heavy drugs) పట్టుబడటం కలకలంగా మారింది. గత కొంత కాలంగా ముంబైలో డ్రగ్స్ మహమ్మారిని అంతం చేసేందుకు పోలీసులు యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 సంవత్సరంలో ముంబై పోలీసులు డ్రగ్స్ నెట్‌వర్క్‌పై చారిత్రాత్మక దాడులు నిర్వహించి, ఏకంగా రూ. 814 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి ఈ ఏడాది మొత్తం 1096 కేసులు నమోదు కాగా, వీటిలో 1386 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దందాను తుడిచి పెట్టేందుకు పోలీసులు మునుపెన్నడూ లేనంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.

మరోవైపు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పండగ సీజన్‌లో డ్రగ్స్ సరఫరా పెరిగే అవకాశం ఉండటంతో నగరంలోని పబ్బులు, క్లబ్బులు, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలపై పోలీసులు డేగ కన్ను వేశారు. ముఖ్యంగా రేవ్‌ పార్టీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీస్ యంత్రాంగం వెల్లడించింది. డ్రగ్స్ విక్రేతలతో పాటు వాటిని వినియోగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని, పండగ వేడుకల పేరుతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ముంబై పోలీసులు హెచ్చరించారు.

Next Story