Drugs Seize: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురు విదేశీయులు అరెస్ట్

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Drugs Seize: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం.. ముగ్గురు విదేశీయులు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌ (Drugs Free State)గా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (Hyderabad Narcotic Enforcement Wing) సిబ్బంది, లంగర్‌‌హౌజ్ (Langerhouse), హుమాయున్‌ నగర్‌ (Humayun Nagar) పోలీసులు జాయింట్ ఆపరేషన్‌ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.1.60 కోట్ల విలువైన 1300 గ్రాముల నిషేధిత డ్రగ్ ఎండీఎంఏ (MDMA)ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story