- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. క్షణాల్లో వాలిపోయిన ఈగల్ టీమ్
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. నగరంలోని ఉప్పల్ మైదానం వద్ద పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. నగరంలోని ఉప్పల్ మైదానం వద్ద పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు రూ.10 లక్షల విలువైన డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. కాగా, ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ వ్యవస్థ(Eagle System)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉద్యమాల గడ్డ తెలంగాణలో ఇకనుంచి రాష్ట్రంలో ఒక్క గంజాయి మొక్క మెలిచినా ఇట్టే కనిపెట్టేలా ‘ఈగల్’(ఎలైట్ ఆక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్)ను ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ ప్రకటించారు. డ్రగ్స్‌తో ఎవరైనా తెలంగాణలో కాలు పెట్టాలంటే వందసార్లు ఆలోచించాలని.. ఒక గడ్డి పరకైనా రాష్ట్రంలో అడుగుపెట్టినా వెన్ను విరుస్తామని హెచ్చరించారు. యువకులు డ్రగ్స్ బారిన పడి బలవుతున్నారని.. డ్రగ్స్ నియంత్రించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. పాఠశాలు, కాలేజీల్లో ఎక్కడైనా సరే దీనికి సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు.






