HYD: ఫామ్‌హౌజ్‌లో ఐటీ ఉద్యోగి బర్త్ డే పార్టీ.. డ్రగ్స్‌తో పాటు అత్యంత ఖరీదైన మద్యం లభ్యం

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-03 09:16:47  IST  )

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి.

HYD: ఫామ్‌హౌజ్‌లో ఐటీ ఉద్యోగి బర్త్ డే పార్టీ.. డ్రగ్స్‌తో పాటు అత్యంత ఖరీదైన మద్యం లభ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో డ్రగ్స్(Drugs) కలకలం రేపాయి. ఆదివారం సెలవు దినం కావడంతో ఐటీ ఉద్యోగులు చేవెళ్లలోని ఓ ఫామ్‌హౌజ్‌లో బర్త్ డే పార్టీ(Birthday Party) నిర్వహించారు. ఈ బర్త్ డే పార్టీలో డ్రగ్స్‌తో పాటు అత్యంత ఖరీదైన మద్యం వినియోగించారు. పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు.. రెడ్ హ్యాండెడ్‌గా డ్రగ్స్‌ పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ దాదాపు రూ.2 లక్షల పైనే ఉంటుందని అంచనా వేశారు. అంతేకాదు.. మూడు లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆరుగురు ఐటీ ఉద్యోగులను, ఫామ్‌హౌజ్ నిర్వహకుడిని అరెస్ట్ చేశారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story