హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

by Muthe.Rajitha |

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది.

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. వివిధ నగరాల నుంచి హైదరాబాద్ కు MDMA వంటి సింథటిక్ డ్రగ్స్‌ తరలిస్తున్నట్టు సమాచారం అందటంతో పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో మాసబ్ ట్యాంక్ పోలీసులు మరియు హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW) జాయింట్ ఆపరేషన్‌ చేపట్టగా.. బెంగళూరు నివాసి అయిన అజీజ్ అహ్మద్ ను అరెస్ట్ చేసారు అతని వద్ద 11 గ్రాముల MDMAతో పాటు 35 గ్రాముల కొకైన్, 5 గ్రాముల OG కుష్, 15 ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకున్నారు.

వీటి విలువ సుమారు ₹12 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. అయితే అజీజ్ ఇచ్చిన సమాచారంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రానున్న న్యూ ఇయర్ నేపథ్యంలో నగరంలోకి డ్రగ్స్ సరఫరా పెరిగే అవకాశం ఉండటంతో నార్కోటిక్ పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన తనిఖీలు చేపడుతున్నారు.

Next Story