మహిళా అధికారిణితో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాసలీలలు.. నెట్టింట్లో వీడియోలు వైరల్

by Disha Web Desk |
మహిళా అధికారిణితో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాసలీలలు.. నెట్టింట్లో వీడియోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్ : బాధ్యత కలిగిన అధికారి పక్కదారి పట్టాడు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన ఆఫీసర్.. ఆ నలుగురిలోనే నవ్వుల పాలయ్యేలా ప్రవర్తించాడు. తోటి మహిళా ఉద్యోగినితో ఎఫైర్ పెట్టుకుని రచ్చకెక్కాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు జరిపిన రాసలీలల వీడియోలు బయటపడటంతో వైద్యశాఖలో కలకలం సృష్టించింది. కర్నూలు నుంచి ఏలూరు వరకు నాలుగు జిల్లాలను కుదిపేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో గతంలో పని చేసిన ఓ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అదే డిపార్ట్‌మెంట్‌లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పని చేసే మహిళా అధికారిణిని లోబర్చుకున్నాడు. ఆమెతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగాడు. ఆ సమయంలో ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేశారు. తన భార్యకు విడాకులు ఇచ్చి ఆ మహిళా అధికారిణిని పెళ్లి చేసుకుంటానని హామీ కూడా ఇచ్చిన ఈ డ్రగ్ ఇన్‌స్పెక్టర్.. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ప్రస్తుతం ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. సదరు మహిళా అధికారిణిని సైతం ఉమ్మడి కృష్ణా జిల్లాకు బదిలీ అయింది. అయితే ఆ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఆమెను వివాహం చేసుకోకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.

అధికారులు వీరిద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చినా సదరు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మనసు మార్చుకోకపోవడంతో ఆ మహిళా అధికారిణి మీడియాకు ఎక్కింది. తనతో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఏకాంతంగా గడిపిన వీడియోలు, ఫొటోలను బయటపెట్టింది. వీటిపై స్పందించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్.. ఆ మహిళా అధికారిణి కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని తెలిపారు. ఉన్నతాధికారులు కూడా ఆమెను మందలించి పంపించారని వివరించారు. తనను అప్రతిష్టపాలు చేయడంతోపాటు తనను కుటుంబంతో విడదీయడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తనపై బెదిరింపులకు దిగుతుందని తెలిపారు. ఏదిఏమైనా ఇద్దరి అధికారుల నగ్న వీడియోలు సోషల్ మీడియాకు ఎక్కడంతో వైద్యశాఖలో కలకలం సృష్టిస్తోంది.

READ MORE

వ్యభిచారం చేస్తూ దొరికిన మహిళలను ఏం చేస్తారు? (వీడియో)

వాట్సాప్‌లో అమ్మాయిల ఫొటోస్ చూడగానే బుక్ చేసుకుంటారు! (వీడియో)

నన్ను వేధిస్తున్నారు.. వైద్య శాఖలో ANM వాయిస్ మెసేజ్ కలకలం (ఆడియో)


Next Story