శంషాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

by Malleboina Mahesh |

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం కలకలం రేపింది.

శంషాబాద్‌లో డ్రగ్స్ ముఠా అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ (Heavy drugs) పట్టుబడటం కలకలం రేపింది. నమ్మదగిన సమాచారంతో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక క్యాబ్‌లో డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్, చేతన్ అనే ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 5.39 గ్రాముల నిషేధిత MDMA డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఈ మత్తు పదార్థాలను బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

డ్రగ్స్‌తో పాటు నిందితుల వద్ద ఉన్న 6 ఎన్డీపీ (Non-Duty Paid) మద్యం బాటిళ్లను, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన మత్తు పదార్థాల విలువ మార్కెట్‌లో భారీగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని యువతను లక్ష్యంగా చేసుకుని ఈ సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Next Story