- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం తాగిన మైకంలో డ్రైవింగ్.. పల్టీ కొట్టిన కారు.. పలువురికి గాయాలు
by Taduka Kalyani |
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని మహాదేవుని పేట గ్రామ శివారులో మద్యం తాగిన మైకంలో ఉన్న డ్రైవర్ కారు డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై కారు పల్టీ కొట్టింది.

X
దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని మహాదేవుని పేట గ్రామ శివారులో మద్యం తాగిన మైకంలో ఉన్న డ్రైవర్ కారు డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై కారు పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట నుంచి బుద్ధారం కారులో వెళ్తుండగా డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేయడంతో రోడ్డుపై కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో దేవా చారి, లక్ష్మణ్ చారి, ఇంద్రజ, వనజ లు ఉన్నారు. 108 వాహనంలో క్షతగాత్రులను నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story






