డ్రైవర్‌ నిర్లక్ష్యం.. రోడ్డు దాటుతుండగా ఢీకొన్న వాహనం.. ఒకరు మృతి

by Chintha Aamani |

సదాశివపేట మండల పరిధిలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యం.. రోడ్డు దాటుతుండగా ఢీకొన్న వాహనం.. ఒకరు మృతి
X

దిశ,సదాశివపేట: సదాశివపేట మండల పరిధిలో రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ కొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందారు. ఓ మారుతి వేగనార్ డ్రైవర్‌ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని గమనించని డ్రైవర్‌ అతివేగంగా నడపడంతో వాహనం ఢీకొని అక్కడికక్కడే మరణించాడు.సదాశివపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బీదర్ జిల్లాకు చెందిన లోకేష్ (30) స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం మండల పరిధిలోని మద్దికుంట చౌరస్తాలో జాతీయ రహదారి నెంబర్ 65 పై మద్దికుంట వైపు వెళ్లడానికి రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో సదాశివపేట నుంచి వస్తున్న మారుతి వేగనార్ వేగంగా అతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్‌ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని,ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story