- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
టేకులపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కుంజా రాజా బాబు (35) ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు

దిశ,టేకులపల్లి : టేకులపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన కుంజా రాజా బాబు (35) ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజా బాబు కోయగూడెం గ్రామానికి చెందిన పెరుగు వెంకన్నకు చెందిన ట్రాక్టర్‌కు యాక్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం కోయగూడెం నుంచి సంపత్‌నగర్ వైపు ఇసుక లోడింగ్ కోసం ఖాళీ ట్రాక్టర్‌ను తీసుకెళ్తుండగా దంతాల తండా గ్రామంలోని కృష్ణమూర్తి కుంట సమీపంలో ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజా బాబుకు ఛాతీ, ప్రక్కటెముకల వద్ద తీవ్ర గాయాలు కాగా, ట్రాక్టర్‌లో ఉన్న గంగారం గ్రామానికి చెందిన బూర్కే నాగేశ్వరరావుకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే రాజా బాబు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి కుంజా లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టేకులపల్లి ఎస్‌ఐ ఏ. రాజేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






