- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్రలో మరో దారుణం.. దృశ్యం మూవీ తరహాలో భర్త హత్య
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. దృశ్యం సినిమాను తలపించేలా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, ఇంట్లోనే పాతిపెట్టింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. దృశ్యం సినిమాను తలపించేలా ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి, ఇంట్లోనే పాతిపెట్టింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈస్ట్ నలసపోరా ప్రాంతం గడ్గపాడాలో విజయ్ చవాన్, భార్య కోమల చవాన్ తో కలిసి నివసిస్తున్నాడు. కాగా.. 15 రోజులుగా విజయ్ కనిపించకపోవడంతో తన బ్రదర్ కు అనుమానం వచ్చి ఇంటికెళ్లి ఎంక్వైరీ చేశాడు.
ఫ్లోర్ టైల్స్ అన్నీ దెబ్బతినడం గమనించి వాటిని తొలగించగా.. తీవ్ర దుర్వాసన వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వాళ్లు అక్కడికి చేరుకుని ఆ టైల్స్ ను తవ్వి చూశారు. టైల్స్ కింద విజయ్ చవాన్ మృతదేహం కనిపించడంతో షాకయ్యారు. అప్పటికే రెండ్రోజులుగా అతని భార్య కోమల, ఎదురింటి వ్యక్తి మోను కనిపించకపోవడంతో వారిద్దరే హత్య చేసి ఉంటారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ఇద్దరి మధ్య కొంతకాలంగా అఫైర్ నడుస్తున్నట్లు స్థానికులు చెప్పడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






