- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదనపు వరకట్న వేధింపులు.. భర్త అక్రమ సంబంధం.. మనస్తాపంలో మమత మృతి
వర కట్న వేధింపులు, భర్త అక్రమ సంబంధం కలగలసి ఓ యువతి ప్రాణాలు తీశాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది.

దిశ, తిమ్మాపూర్: వర కట్న వేధింపులు, భర్త అక్రమ సంబంధం కలగలసి ఓ యువతి ప్రాణాలు తీశాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో ఈ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందిరానగర్‌కు చెందిన రొడ్డ విజయ తన కుమార్తె మమతను 2018లో రేణికుంట గ్రామానికి చెందిన కర్ర రాజమల్లుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో రెండు లక్షల వరకట్నం ఒప్పుకుని, రూ.70 వేలు ఇచ్చారు. తర్వాత 'కళ్యాణలక్ష్మి' పథకం ద్వారా వచ్చిన లక్ష రూపాయలు కూడా అందజేశారు. అయినప్పటికీ, మరో రూ. 30 వేల కట్నం డబ్బులతో పాటు రూ. 2 లక్షలు అదనపు వరకట్నం తీసుకురావాలని భర్త రాజమల్లు అతని తండ్రి తిరుమలయ్యలు మమతను తరుచూ వేధించేవారు.
ఇంతలో రాజమల్లు మద్యం మత్తుకు బానిసై మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న విషయం మమత తెలుసుకుంది. భర్త మొబైల్‌లో ఉన్న ఫోటోలు చూసిన ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జూన్ 23న క్రిమిసంహారక మందు తాగింది. వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించక బుధవారం మృతి చెందింది. మృతురాలి తల్లి విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజమల్లు, అతని తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






