- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోధ్‌పూర్‌లో దారుణం.. బిడ్డతో కలిసి నిప్పంటించుకున్న లెక్చరర్..
రాజస్థాన్ జోధ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక.. బిడ్డతో కలిసి నిప్పంటించుకుంది లెక్చరర్. డాంగియావాస్ పీఎస్ పరిధిలోని సర్నాడ గ్రామంలో ఈ విషాదం జరిగింది. సంజూ బిష్ణోయ్ మధ్యాహ్నం ఫిట్ కస్నీ గ్రామంలో చేస్తున్న

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ జోధ్‌పూర్‌లో దారుణం చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు తాళలేక.. బిడ్డతో కలిసి నిప్పంటించుకుంది లెక్చరర్. డాంగియావాస్ పీఎస్ పరిధిలోని సర్నాడ గ్రామంలో ఈ విషాదం జరిగింది. సంజూ బిష్ణోయ్ మధ్యాహ్నం ఫిట్ కస్నీ గ్రామంలో చేస్తున్న ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చాక.. మూడేళ్ల కూతురు యశస్వినిపై, తనపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంది. పాప తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించగా.. సంజూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయింది.
కాగా ఘటనాస్థలిలో దొరికిన సూసైడ్ నోట్‌లో తన చావుకు కారణం భర్త దిలీప్ బిష్ణోయ్, అత్తామామలు, తోటికోడలు, గణపత్ సింగ్ అని రాసింది. వరకట్న వేధింపులతోపాటు భర్త, గణపత్ సింగ్‌తో కలిసి తనను శారీరక, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. కాగా సంజూ మొబైల్, ఆత్మహత్య లేఖ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదైంది.
Also Read.






