200 తులాల బంగారం, రూ.1.5 కోట్ల కట్నం.. అయినా తప్పని వరకట్న వేధింపులు

by Ajay Maddhiboyina |

పెళ్లికి 200 తులాల బంగారం, 1.5 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, 10 కిలోల వెండి క‌ట్నంగా ఇచ్చినా అత్తింటివారి దాహం తీర‌లేదు. పెళ్లైన ఏడాదికే భ‌ర్త‌, అత్త‌మామ‌లు వేధించ‌డంతో

200 తులాల బంగారం, రూ.1.5 కోట్ల కట్నం.. అయినా తప్పని వరకట్న వేధింపులు
X

దిశ‌, వెబ్ డెస్క్: పెళ్లికి 200 తులాల బంగారం, 1.5 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు, 10 కిలోల వెండి క‌ట్నంగా ఇచ్చినా అత్తింటివారి దాహం తీర‌లేదు. పెళ్లైన ఏడాదికే భ‌ర్త‌, అత్త‌మామ‌లు వేధించ‌డంతో భార్య పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఏపీలో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గొల్ల‌పూడికి చెందిన ఓ యువ‌తి గైన‌కాల‌జీలో ఎంఎస్ చేసింది. ఆమెకు క‌ర్ణాట‌క‌లోని రాయ‌చూర్ జిల్లాకు చెందిన కార్డియాల‌జీలో పీజీ చ‌దువుతున్న యువ‌కుడితో గ‌తేడాది వివాహం జ‌రిగింది. పెళ్లి స‌మ‌యంలో అత‌డికి యువ‌తి త‌ల్లి దండ్రులు రూ.1.5 కోట్ల క‌ట్నం, 200 తులాల బంగారం, 10 కేజీల వెండి క‌ట్నంగా ఇచ్చారు.

వాటితో పాటు రూ.50 లక్ష‌ల ఆడ‌ప‌డుచు లాంచ‌నాలు, రూ.30 ల‌క్ష‌ల విలువ చేసే గృహోప‌క‌ర‌ణాలు సైతం ఇచ్చారు. అయితే అన్ని ఇచ్చి భ‌ర్త, అత్త‌మామ‌ల దాహం తీర‌లేదు. ఆస్ప‌త్రి నిర్మాణం కోసం రూ.12.5 కోట్లు అద‌న‌పు క‌ట్నం ఇవ్వాల‌ని వేధించ‌డం మొద‌లు పెట్టారు. అంతేకాకుండా ఈ ఏడాది సెప్లెంబ‌ర్ లో భార్య పుదుచ్చేరిలోని ఓ ఆస్ప‌త్రిలో ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నివ్వ‌గా చూసేందుకు వ‌చ్చి అక్క‌డే భార్య‌ను, బిడ్డ‌ను వ‌దిలేసి వెళ్లిపోయాడు. విడాకులు కావాల‌ని గొడ‌వ పెట్టుకున్నాడు. దీంతో బాధితురాలు భ‌ర్త‌, అత్త‌మామ‌ల‌పై మ‌హిళా పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది.

Next Story