నా ప్రియుడు అమ్మాయిలను సప్లై చేస్తున్నాడు..డీఎంకే నేత ప్రేయసి సంచలనం

by Ajay Maddhiboyina |

తన ప్రియుడు రాజకీయ నాయకులకు అమ్మాయిలను సప్లై చేస్తున్నాడంటూ డీఎంకే పార్టీ నాయకుడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని అరక్కోణంకు చెందిన దేవసేయల్

నా ప్రియుడు అమ్మాయిలను సప్లై చేస్తున్నాడు..డీఎంకే నేత ప్రేయసి సంచలనం
X

దిశ‌, వెబ్ డెస్క్: తన ప్రియుడు రాజకీయ నాయకులకు అమ్మాయిలను సప్లై చేస్తున్నాడంటూ డీఎంకే పార్టీ నాయకుడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని అరక్కోణంకు చెందిన దేవసేయల్ డీఎంకే యువజన విభాగంలో డిప్యూటీ సెక్రటరీ పదవిలో ఉన్నాడు. కాగా దేవసేయల్ 20 ఏళ్ల మహిళలను రాజకీయ నాయకులతో నిద్రపోయేలా బలవంతం చేశాడని అతని అతడి ప్రేయసి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో జాతీయ మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. తక్షణమే దర్యాప్తుకు ఆహ్వానించింది.

మరోవైపు డీఎంకే పార్టీ కూడా అతడిని ఇప్పటికే సస్పెండ్ చేసింది. డీఎంకే పార్టీ నేత తీరును వ్యతిరేకిస్తూ అన్నా డీఎంకే నేతలు నిరసనలు తెలపడంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే దేవసేయల్ ప్రేయసి ఫిర్యాదుతో అతడి బండారం బయటపడింది. దేవసేవియల్ తనను రెండో పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా ఇతర డీఎంకే నేతల వద్దకు తనను కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని ఆరోపించింది. తాను నిరాకరించడంతో వేధింపులకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలోనూ తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని కానీ పోలుసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది.

Next Story