- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడదెబ్బతో దివ్యాంగుడు మృతి
ఎండల తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బతో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. ఈ హృదయవిదారక సంఘటన పట్టణంలోని 21వ వార్డులో బుధవారం వెలుగుచూసింది.

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎండల తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బతో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. ఈ హృదయవిదారక సంఘటన పట్టణంలోని 21వ వార్డులో బుధవారం వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. గాజర్ల వెంకటయ్య, సుగుణమ్మ దంపతుల కుమారుడైన సతీష్ (దివ్యాంగుడు) గత కొద్ది రోజులుగా కురుస్తున్న భానుడి భగభగలకు తీవ్ర అస్వస్థతకు గురై, వడదెబ్బతో ప్రాణాలు విడిచాడు.
కన్నీరు మున్నీరవుతున్న వృద్ధ తల్లిదండ్రులు
కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబంలో సతీష్ మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. వృద్ధులైన తల్లిదండ్రులకు కనీసం కొడుకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా చేతిలో పైసా లేని దుస్థితి నెలకొంది. వీరి దీనస్థితిని గమనించిన స్థానిక కౌన్సిలర్ పంజాల మనోజ్, బిఆర్ఎస్ నాయకుడు వేముల గోవర్ధన్ లు మానవత్వంతో స్పందించి, అంత్యక్రియల నిమిత్తం తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వార్డు ప్రజల సైతం కొంత ఆర్థిక సహాయం అందించారు.
దాతలు, ప్రభుత్వం ముందుకు రావాలి
"కడు పేదరికంలో ఉన్న ఈ వృద్ధ దంపతులను చూస్తే గుండె తరుక్కుపోతోంది. కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని ఆదుకోవడానికి మరికొందరు దాతలు ముందుకు రావాలి" అని స్థానిక ప్రజలు కోరుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఈ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆర్థికంగా ఆదుకోవాలని హుజురాబాద్ పట్టణ ప్రజలు, సామాజిక కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.






