జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఏనుగు బీభత్సం, తొక్కిసలాట

by Kema Shiva Kumar |

జగన్నాథ రథయాత్ర (Jagannath Rathyatra)లో ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఏనుగు బీభత్సం, తొక్కిసలాట
X

దిశ, వెబ్‌డెస్క్: జగన్నాథ రథయాత్ర (Jagannath Rathyatra)లో ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి ఒడిశా (Odisha)లోని పూరి జగన్నాథ రథయాత్ర తరహాలోనే భక్తులు గుజరాత్‌లోని గోల్‌వాడ (Golwada)లో రథయాత్రను నిర్వహించారు. అయితే, నిర్వాహకులు యాత్రలో ప్రత్యేక ఆకర్షణకు ఏనుగులను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో యాత్ర ప్రారంభమైన 10 నిమిషాలకు అందులో ఉన్న ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. ఏకంగా భక్తులపైకి దూసుకెళ్లడంతో వారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. దీంతో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Next Story