- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ సంబంధం వివాదం.. వ్యక్తి దారుణ హత్య
అక్రమ సంబంధం నేపథ్యంలో వ్యక్తిని గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఉట్నూర్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

దిశ, ఉట్నూర్ : అక్రమ సంబంధం నేపథ్యంలో వ్యక్తిని గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేసిన ఘటన ఉట్నూర్ మండలంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నర్సాపూర్ బీ గ్రామానికి చెందిన కాంబ్లే చంద్రముని(43) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం కుటుంబంలో కలహాలకు దారితీయడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి చంద్రముని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా అభినందన్, సీతావాల్‌తో పాటు మరికొందరు వ్యక్తులు అతనిపై గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చంద్రమునిని 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు పరీక్షించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని సీఐ ప్రసాద్, ఎస్సై విజయ్ పరిశీలించారు. మృతుడి భార్య వర్ష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.






