రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దిశ రిపోర్టర్ మృతి

by velandi.Saikiran |

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వనపర్తి టౌన్ దిశ రిపోర్టర్ విష్ణువర్ధన్ చికిత్స‌ పొందుతూ గురువారం మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దిశ రిపోర్టర్ మృతి
X

దిశ, వనపర్తి రూరల్ : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వనపర్తి టౌన్ దిశ రిపోర్టర్ విష్ణువర్ధన్ సాగర్ (35) చికిత్స‌ పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాలలోకి వెళితే, ఐజ మండలంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి వారం రోజుల క్రితం విష్ణువర్ధన్ సాగర్ వెళ్లాడు. ఈ క్ర‌మంలో బూడిదపాడు గ్రామం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని హుటా హుటిన కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ తరలించారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించి, చికిత్స‌ పొందుతూ గురువారం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీరంగాపురం మండలం దానంపేట గ్రామానికి చెందిన విష్ణువర్ధన్ సాగర్ వనపర్తి పట్టణంలో కుటుంబంతో ఉంటూ కొంతకాలం నుండి దిశ పత్రిక వనపర్తి టౌన్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. విష్ణువర్ధన్ సాగర్ కు తల్లిదండ్రులు, భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.

Next Story