జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

by Disha Web Desk 20 |
జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య
X

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామానికి చెందిన ఘర్కేడి విజయ్ (28)కు కవిత తో వివాహం జరిగినది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. విజయ్ కు ఎలాంటి ఉపాధి లభించక గత కొన్ని రోజుల నుండి అతని భార్య, పిల్లలు అతన్ని విడిచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో విజయ్ మానసిక ఆవేదనకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం 11 గంటలకు తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించగా శనివారం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినాడు. అతని భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బిచ్కుంద ఎస్సై శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.

Next Story

Most Viewed