ఇద్దరు చిన్నారుల అదృశ్యమై చెరువులో విగతజీవులుగా..!

by Ratna Kumari |

పట్టణంలో చిన్నారుల అదృశ్యాలు విషాదం అవుతున్నాయి. ఇటీవల ఐదుగురు చిన్నారుల అదృశ్యం కేసులో ముగ్గురు అమ్మాయిలు కామారెడ్డి పెద్ద చెరువులో తండ్రి చేతిలో హత్యకు గురి కాగా..

ఇద్దరు చిన్నారుల అదృశ్యమై చెరువులో విగతజీవులుగా..!
X

దిశ, కామారెడ్డి టౌన్ : పట్టణంలో చిన్నారుల అదృశ్యాలు విషాదం అవుతున్నాయి. ఇటీవల ఐదుగురు చిన్నారుల అదృశ్యం కేసులో ముగ్గురు అమ్మాయిలు కామారెడ్డి పెద్ద చెరువులో తండ్రి చేతిలో హత్యకు గురి కాగా.. అదృశ్యమైన మరొక ఇద్దరు చిన్నారులు శనివారం ఓ పాడుబడిన బావిలో శవాలై తేలారు. ఈనెల 6న గోసంగి కాలనీకి చెందిన పనేటి శారద కుమారుడు సింహాద్రి (10) అలియాస్​ నరసింహ, ఆమె అన్న కుమారుడు కొడండం విజయ్ (9) మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయారు. దీంతో ఆమె 7న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. పాడబడ్డ బావిలో.. శనివారం రాజానగర్ కాలనీలో ఓ పాడుబడిన బావిలో చిన్నారులిద్దరి మృతదేహాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిల్లలు బావిలో చేపలను పడుతూ ప్రమాదవశాత్తు జారి పడి చనిపోయినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Next Story