- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువకుడి అదృశ్యం
by Kema Shiva Kumar |
ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని చెట్ల తిమ్మాయపల్లి పులిగుట్టతండాలో మంగళవారం చోటుచేసుకుంది.

X
దిశ చేగుంట : ఓ యువకుడు అదృశ్యమైన ఘటన మండల పరిధిలోని చెట్ల తిమ్మాయపల్లి పులిగుట్టతండాలో మంగళవారం చోటుచేసుకుంది. చేగుంట ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. పులిగుట్టతండాకు చెందిన కరెంతోడ్ శ్రీనివాస్ (23) 10న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రపోయాడు. 11న ఉదయం నిద్ర లేచి చూసేసరికి శ్రీనివాస్ ఇంట్లో లేకుండాపోవడంతో చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో, బంధువుల వద్ద వెతికారు. వారం రోజులుగా శ్రీనివాస్ గురించి వెతుకుతున్నప్పటికీ ఎక్కడ ఆచూకీ లభించలేదు. శ్రీనివాస్ ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో నలుపు రంగు షర్టు, జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని, సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉంటాడని ఫిర్యాదులో తెలిపారు. శ్రీనివాస్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ తెలిపారు.
Next Story






