ప్రాథమిక వ్యవసాయ సంఘం డైరెక్టర్ ఆత్మహత్య

by Sridhar Babu |

నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన గాదరి రాజలింగం (54) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రాథమిక వ్యవసాయ సంఘం డైరెక్టర్ ఆత్మహత్య
X

దిశ, నందిపేట్ : నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన గాదరి రాజలింగం (54) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే రాజలింగం ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సొసైటీ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. కొద్దిరోజుల క్రితం కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకు చేసిన అప్పులు తీర్చలేక ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో శుక్రవారం పొలానికి తీసుకొచ్చిన పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాన్ని గమనించిన ఆయన కుమారుడు సతీష్ నిజామాబాద్ లోని ఓ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు.

Next Story