భార్యను ముక్కలు ముక్కలు చేసి చంపిన కేసులో సంచలనాలు.. అలా అడిగిందనే హత్య

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ మేడిపల్లిలో గర్భిణి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మూడు నెలల గర్భిణిని భర్త అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలు చేసి హత్య చేశాడు.

భార్యను ముక్కలు ముక్కలు చేసి చంపిన కేసులో సంచలనాలు.. అలా అడిగిందనే హత్య
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మేడిపల్లిలో గర్భిణి హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మూడు నెలల గర్భిణిని భర్త అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలు చేసి హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను కవర్లలో తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఇది వరకే ఓసారి స్వాతి గర్భం దాల్చగా భర్త మహేందర్ రెడ్డి బలవంతంగా తీయించినట్టు గుర్తించారు. స్వాతి మహేందర్ రెడ్డిది వికారాబాద్ జిల్లా కాగా వీరిద్దరిదీ ఒకే గ్రామం కూడా. ఇద్దరూ ప్రేమించుకున్న అనంతరం కుటుంబ సభ్యలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చారు.

స్వాతి ఓ కాల్ సెంటర్ లో పనిచేస్తుండగా, మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గతంలో భార్యను వేధించడంతో వికారాబాద్ లో మహేందర్ రెడ్డిపై 489ఏ కేసు నమోదైంది. ఈ నెల 22న మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తనను మెడికల్ చెకప్స్ కు తీసుకెళ్లాలని స్వాతి కోరగా ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ పెద్దది అవ్వగా హత్య చేయాలని భర్త నిర్ణయించుకున్నాడు. అందుకోసం బోడుప్పల్ లో ఒక హాక్సాబ్లేడ్ కొనుగోలు చేశాడు. బాడీని ఒకేసారి తరలించడం వీలు కాక ముక్కులు ముక్కలుగా చేశాడు. తల, కాళ్లు, చేతులు వేర్వేరు కవర్లలో చుట్టి శరీర భాగాలను పడేశాడు. మూడుసార్లు మూసీకి వెళ్లి శరీర భాగాలను పడేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం మూసీ నుండి శరీర భాగాలను వెతికి తీస్తున్నారు.

Next Story