- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. గుట్కాకు డబ్బులివ్వని భర్త.. ముగ్గురు పిల్లలకు విషం పెట్టిన భార్య..
ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌కు చెందిన మహిళ జుంకీకి గుట్కా తినే అలవాటు ఉంది. ఈ విషయంపైనే భర్త బబ్బూ యాదవ్‌తో గొడవ జరిగింది. వెంటనే అలవాటు మానుకోవాలని.. గుట్కా కొనుక్కునేందుకు డబ్బులివ్వనని చెప్పి వెళ్లిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ చిత్రకూట్‌కు చెందిన మహిళ జుంకీకి గుట్కా తినే అలవాటు ఉంది. ఈ విషయంపైనే భర్త బబ్బూ యాదవ్‌తో గొడవ జరిగింది. వెంటనే అలవాటు మానుకోవాలని.. గుట్కా కొనుక్కునేందుకు డబ్బులివ్వనని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపానికి గురైన జుంకీ.. తన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తను కూడా తాగేసింది. పిల్లలు ఒకటి నుంచి ఐదేళ్లలోపు వారు. కాగా తల్లితోపాటు ఇద్దరు ఆడ పిల్లలు బుల్బుల్, చంద్రమ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు ప్రారంభించారు. నిజంగా జుంకీ గుట్కా తింటుందా? ఈ విషయంపైనే గొడవ జరిగిందా? లేక మరేదైనా కారణమా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చనిపోయేదేదో చనిపోకుండా.. పిల్లలను చంపిందని తిట్టిపోస్తున్నారు.
Also Read.






