- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గాజులరామారంలో కూల్చివేతలు.. జేసీబీ తగలడంతో గర్భిణీకి గాయాలు..
గాజులరామారంలో సర్వే నెంబర్ 329 లో మంగళవారం ఉదయం జరిగిన కూల్చివేతలను అడ్డుకునేందుకు బాధితులు ప్రయత్నించారు.

X
దిశ, కుత్బుల్లాపూర్: గాజులరామారంలో సర్వే నెంబర్ 329 లో మంగళవారం ఉదయం జరిగిన కూల్చివేతలను అడ్డుకునేందుకు బాధితులు ప్రయత్నించారు. ఇళ్లను కూల్చేందుకు వచ్చిన రెవిన్యూ అధికారులను బ్రతిమిలాడారు. ఈ క్రమంలో కూల్చేందుకు వచ్చిన జేసిబీ తగలడంతో గాయాలై ఓ గర్భిణీ సొమ్మసిల్లి పడిపోయింది. ఇక తమ ఇళ్లను కూల్చుతున్నారనే బెంగతో ఇద్దరు వ్యక్తులు హార్ట్ స్ట్రోక్ కూ గురై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
బాధితులు అందరూ దేవేందర్ నగర్ లోని కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం, దేవేందర్ నగర్ చౌరస్తా లో ధర్నా చేశారు. బాధితులు ఒక్కసారిగా రోడ్లపై వచ్చి ధర్నా, రాస్తా రోకో చేయడంతో గాజులరామారంలో ట్రాఫిక్ స్తంభించింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
Next Story






