HYD: డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోలిచౌకి ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ప్రయివేట్ బస్సు డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లింది.

HYD: డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లిన ప్రైవేట్‌ బస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోలిచౌకి ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ప్రయివేట్ బస్సు డెలివరీ బాయ్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం(Delivery Boy Dead) చెందారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్డర్‌ డెలివరీ చేసేందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌ స్కిడ్‌ అయి కిందపడిపోయాడు. కిందపడిన డెలివరీ బాయ్ అభిషేక్‌పైనుంచి ప్రయివేట్ బస్సు దూసుకెళ్లింది. ఆపకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో బస్సును స్థానికులు వెంబడించారు. ఎట్టకేలకు పట్టేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story