ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్‌ పూల్‌లో మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..

by Sujitha Rachapalli |

ఢిల్లీ నరేలా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఎంకే స్విమ్మింగ్ పూల్ ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. ఇందులో ప్రస్తుతం వర్క్ జరుగుతుండగా.. అనిల్ కాంట్రాక్టర్, మునిల్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.

ఢిల్లీలో దారుణం.. స్విమ్మింగ్‌ పూల్‌లో మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ నరేలా ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఎంకే స్విమ్మింగ్ పూల్ ఇంకా పూర్తిగా నిర్మాణం కాలేదు. ఇందులో ప్రస్తుతం వర్క్ జరుగుతుండగా.. అనిల్ కాంట్రాక్టర్, మునిల్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. అయితే ఈ స్విమ్మింగ్ పూల్‌కు సమీపంలో ఉండే బవానా స్లమ్‌కు చెందిన తొమ్మిదేళ్ల మైనర్ బాలికలు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఇంతకు ముందు కూడా అక్కడ ఆడుకున్న వాళ్లు ఇంట్లోనే చెప్పకుండా వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక.. ఈ ఇద్దరు పిల్లలను లోపలికి వచ్చారు కాబట్టి డబ్బులు ఇవ్వాలని అడిగారు. లేదనడంతో వారిని ఓ రూమ్‌లో బంధించి.. రాత్రంతా అత్యాచారం చేసి, పొద్దున నాలుగున్నర గంటల సమయంలో విడిచిపెట్టారు. బయట చెప్తే చంపేస్తామని బెదిరించారు.

ఆగస్టు 5న ఈ ఘటన జరగ్గా.. పిల్లలు భయంతో ఎవరికీ చెప్పుకోలేకపోయారు. కానీ వీరిలో ఓ పాప తన అత్తకు అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆగస్టు 7న ఆమెతో పంచుకుంది. ఆ తర్వాతి రోజు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. ఆగస్టు 9న కేసు ఫైల్ చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని రిపోర్ట్‌లో తేలడంతో.. గ్యాంగ్ రేప్‌, పోక్సోతోపాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆగస్టు 10న నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఘటనా స్థలిలో కండోమ్ ప్యాకెట్లు, మరకలున్న బెడ్ షీట్, దిండు, డిజటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story