బర్త్ డే గిఫ్ట్‌ల విషయంలో గొడవ.. అత్త, భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త

by Ajay Maddhiboyina |

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడి బ‌ర్త్ డే విష‌యంలో జ‌రిగిన గొడ‌వ‌లో ఓ వ్య‌క్తి త‌న భార్య‌, అత్త‌ను హ‌త్య చేశాడు. యోగేష్ సెహ‌గ‌ల్ అనే త‌న కొడుకు చిరాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇంట్లో సెల‌బ్రేట్ చేశాడు.

బర్త్ డే గిఫ్ట్‌ల విషయంలో గొడవ.. అత్త, భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. కుమారుడి బ‌ర్త్ డే విష‌యంలో జ‌రిగిన గొడ‌వ‌లో ఓ వ్య‌క్తి త‌న భార్య‌, అత్త‌ను హ‌త్య చేశాడు. యోగేష్ సెహ‌గ‌ల్ అనే త‌న కొడుకు చిరాగ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇంట్లో సెల‌బ్రేట్ చేశాడు. ఈ క్ర‌మంలో కుమారుడి బ‌ర్త్ డే గిఫ్టుల విష‌యంలో యోగేష్ సెహ‌గ‌ల్‌కు అతడి భార్య, అత్తతో గొడవ జరిగింది. మీ వాళ్లేం పెట్టారు.. మావాళ్లేం పెట్టారు అని ఇరువురి మధ్య గొడవ జరగ్గా యోగేష్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో యోగేష్ భార్య, అత్తపై అక్కడే ఉన్న కత్తెరతో దాడి చేసి హతమార్చాడు.

మరుసటి రోజు అతడి బావమరిది మేఘ్ సిన్హా ఇంటికి రాగా డోర్ లాక్ చేసి ఉండడగా, అక్కడ రక్తపు మరకలు కనిపించాయి. తాళం పగలగొట్టి చూసేసరికి తన తల్లి, సోదరి డెడ్ బాడీలు కనిపించాయి. దీంతో వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. యోగేష్ హత్య తరవాత తన పిల్లలతో కలిసి పారిపోగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగాయని పోలీసులు వెల్లడించారు.

Next Story