Suicide: ఉరి వేసుకొని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌(Narsinghi Police Station) పరిధిలోని హైదర్‌కోట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Suicide: ఉరి వేసుకొని డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్‌(Narsinghi Police Station) పరిధిలోని హైదర్‌కోట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరి వేసుకొని శ్రీజ(Sreeja) అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న శ్రీజ.. ఇటీవల హైదర్‌కోట్‌లో నివాసం ఉంటున్న తన అక్క వద్దకు వచ్చింది. బుధవారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఫ్యాన్స్‌కు ఉరి వేసుకొని బలవన్మరణాని(Suicide)కి పాల్పడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శ్రీజది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా గుర్తించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story