- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో బీటెక్ విద్యార్థిని కీర్తి ఆత్మహత్యకు పాల్పడింది.

దిశ, వెబ్‌డెస్క్: ఒంటిపై డీజిల్ పోసుకుని.. నిప్పంటించుకుని ఓ బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. మీర్‌పేట్ (Meerpet) పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న కీర్తి (Keerthi) బీటెక్ చదువుతోంది. శనివారం ఆమె తన నివాసంలో ఎవరూ లేని సమయంలో ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల ధాటికి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం కీర్తి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇవాళ వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అనంతరం డెడ్‌బాడీని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఫోన్ డేటాపై పోలీసుల దర్యాప్తు..
కీర్తి బలవన్మరణానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా కీర్తి వినియోగించిన మొబైల్ ఫోన్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనైనా మాట్లాడిందా.. ఏవైనా బెదిరింపులు ఎదుర్కొందా? లేక వ్యక్తిగత కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.






